సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్
వరంగల్, ఆగస్టు 16: పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం వరంగల్ జిల్లా అభివృద్ధి, విద్యార్థులు, యువత, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు మహమ్మద్ అయూబ్ తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల...