నవంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనం, సేవల టికెట్లకు తేదీలు ఖరారు
తిరుమల: నవంబర్ 2026 నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి, ప్రత్యేక దర్శనం తదితర టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ తేదీలను టీటీడీ ప్రకటించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముఖ్యమైన బుకింగ్ తేదీలు : ఆగస్టు 18 నుంచి 20 వరకు – ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్‌నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ఆగస్టు 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు 21 – ఆర్జిత సేవల టికెట్లు : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత...