బాలాపూర్‌లో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని హత్య

హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన ప్రియురాలిని హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో కలకలం రేపింది. ప్రేమ పేరుతో స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్లో పనిచేసే యువతికి అహ్మద్‌ (21) అనే యువకుడు దగ్గరైనట్లు సమాచారం.ఇటీవల యువతి గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని అహ్మద్‌పై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించిన అహ్మద్‌.. హత్యకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోనె సంచిలో మృతదేహాన్ని తరలిస్తున్న అహ్మద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు...