నాగేంద్రస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నాగులపంచమి వేడుకలు ఉదయం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక్కడ దర్శించుకుంటే వీసా ఓకే అవుతుందని, పెళ్లి కానీ వారికీ పెళ్లిళ్లు, సంతానం, గ్రహ దోష నివారణ, భక్తులు నమ్ముతున్నారు.