ఎన్నికల హామీల మేరకు తులం బంగారం ఇవ్వాలి: గండ్ర వెంకటరమణారెడ్డి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా అమలు చేయాలి హామీలు అమలు చేయకుండా మాటలతో తప్పించుకోలేరు రిపోర్టర్‌పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆందోళన భూపాలపల్లి, ఆగస్టు 17, 2026: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. రిపోర్టర్‌పై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి...