పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులను పోలీస్ కమిషనర్‌కు పరిచయం చేశారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కె. కరుణాకర్, ఉపాధ్యక్షులుగా బి. సతీష్, బి. శరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా బి. నరేష్, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి, సి.హెచ్. మహేందర్...