సాగునీరు లేక ఎండిపోయిన సాగు పంటలు

*సిత్య తండాలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించి, రైతు రమావత్ భిక్ష తదితరులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పాలకుర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సిత్య తండాలో SRSP కాలువ నుండి నీటి విడుదల చేయక ఎండిపోయిన పంట పొలాలను రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న రైతు రమావత్ భిక్ష పొలంలో బోరును, పక్కనే అనుకొని ఉన్న చెక్ డ్యామ్ ను పరిశీలించి సాగు నీరు అందక ఎండిపోయిన నారు మడిని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి...