రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డలతో ఆటలా..? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్

హనుమకొండ, ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో ధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్...