రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో పనిచేస్తోంది: చల్లా ధర్మారెడ్డి
వరంగల్: హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరకాలలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభతో ప్రజలకు ఒరిగిందేమిటని చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై ముఖ్యమంత్రి మాట్లాడలేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తామే చేసినట్లు చెప్పుకుంటోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రజాపాలన పేరుతో సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచలేని అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందని అన్నారు....