ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు, వాదనలను సెప్టెంబర్‌ 16 లోగా తెలియజేయాలి - జిల్లా కలెక్టర్‌ బి .చంద్రశేఖర్

ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు, వాదనలను సెప్టెంబర్‌ 16 లోగా తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్‌ బి .చంద్రశేఖర్ తెలిపారు . ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని అక్టోబర్ 15లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను అక్టోబర్ 19న ప్రచురించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డీవోలు, తహసీల్దార్లతో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరిగిందని, ఎవరైనా ఓటర్లు, లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటరు జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 17 నుండి,...