తెలంగాణలో SIR-2026 ఎన్యూమరేషన్ దశ పూర్తి
2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరణ.. 78.30 శాతం ఓటర్ల నుంచి స్పందన హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIR-2026లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ దశ విజయవంతంగా పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, IAS తెలిపారు. సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో SIR ప్రక్రియ పురోగతిపై ఆయన వివరించారు.2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ దశలో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నుంచి 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు (EFs) సేకరించినట్లు CEO తెలిపారు. ఇవి రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 78.30...