భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల PAC సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
నల్లగొండ: ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.గతానికి భిన్నంగా జిల్లాల స్థాయిలోనే PAC సమావేశాలు నిర్వహించడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం యవచ్చని తెలిపారు.పార్టీని నమ్ముకుని కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం...