నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో నిండినప్పుడు పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారుతుందని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మల్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన 48 నూతన సీసీ కెమెరాలను ఈరోజు ఎస్పీ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా గా ఎస్పీ గారు మాట్లాడుతూ....ప్రజల రక్షణకు, నేరాల అరికట్టడానికి సీసీ కెమెరాలు అమూల్యమైన సాధనాలు అని. ప్రతి వీధి, ప్రతి మూలలా కెమెరాలు అమర్చడం వలన నేరం జరిగిన వెంటనే గుర్తించడం, నిందితులను పట్టుకోవడం...