దళిత బస్తీలో సహపంక్తి భోజనంలో పాల్గొన్న డాక్టర్ వన్నాల వెంకటరమణ
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్‌లో జన్ను సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దళిత బస్తీలో నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొని స్థానికులతో కలిసి భోజనం చేశారు. సమాజంలో సమానత్వం, సోదరభావం పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, వరంగల్ కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాష్ట్ర నాయకులు త్రిలోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు రఘున్న రెడ్డి, మండల అధ్యక్షులు విప్ప సుధాకర్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, బస్తీ...