పాఖాల సరస్సు నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతి

హైదరాబాద్: నర్సంపేట నియోజకవర్గంలోని పాఖాల సరస్సు నుంచి ఆయకట్టు రైతులకు కాలువల ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో సాగునీటి వనరుల్లో నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, పాఖాల ఆయకట్టు పరిధిలోని రైతులు ఇప్పటికే సుమారు 9 వేల ఎకరాలకు పైగా వరి నాట్లు వేసినట్లు ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పంటలకు అవసరమైన నీరు అందకపోతే నాట్లు ఎండిపోయే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వివరించారు. పాఖాల సరస్సులో...