భద్రకాళి బండ్‌పై ఎలక్ట్రిక్ వెహికిల్ ప్రారంభం..
వరంగల్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానం పరిధిలో భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా నిర్మించిన భద్రకాళి బండ్‌పై సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్‌ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయి గారు, కమిషనర్ శ్రీ వెంకన్న గారు, కుడా అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భద్రకాళి చెరువు సుందరీకరణతో వరంగల్ నగరానికి మరింత అందం చేకూరిందని తెలిపారు. భద్రకాళి బండ్‌పై సందర్శకులను ఆకట్టుకునేలా సరికొత్త రూపురేఖలతో వివిధ అభివృద్ధి, సుందరీకరణ...