నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా - రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా రూ.23.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నల్గొండ పట్టణంలో సిసి రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, తాగునీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని సదుపాయాలను కల్పించి సమస్యలు లేని పట్టణంగా, తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డివిజన్లో 23 కోట్ల 85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజ చేశారు. ముందుగా మంత్రి 3 వ డివిజన్లో షెడ్యూల్ తెగల సంక్షేమ శాఖ...