పాఠాలు చెప్పిన టీచర్‌నే హతమార్చిన విద్యార్థులు
కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు. దోపిడీ కోసం ప్రిన్సిపల్‌ను దారుణంగా హత్య చేసిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాస్త్రీయ దర్యాప్తు, సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక విశ్లేషణతో పోలీసులు కేసును ఛేదించారు. ‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన మర్డర్ మిస్టరీ! హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడిన సమయంలో చివరిగా “బాబు” అని పలికారు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఈ ఒక్క మాట పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా “బాబు” అని...