పల్లె పల్లెకు... పొన్నం అన్న.. ప్రజాపాలనలో ప్రజలతో ముఖాముఖి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు... పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజాపాలన” కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులపై మంత్రి వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను మంత్రికి వివరించేలా ఈ...