ఫోటో జర్నలిస్టులను సన్మానించిన ప్రెస్ క్లబ్ కమిటీ

హనుమకొండ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటో జర్నలిస్టులను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ మీడియాలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఒక ఫోటో వెయ్యిల ప్రశ్నలకు సమాధానం అని అన్నారు. జర్నలిజంలో ఫోటో జర్నలిస్టు సేవలు అమోఘం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్లా అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాము, కోడిపెల్లి దుర్గ ప్రసాద్ రావు , జాయింట్ సెక్రెటరీ వలిశెట్టి సుధాకర్, పొడిశెట్టి విష్ణువర్ధన్, సోంపేట సుధాకర్, కార్యవర్గ సభ్యులు ఎండి నయీమ్ పాషా, వీరగోని హరీష్ తదితరులు పాల్గొన్నారు.