హన్మకొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలు

• డీసీసీ భవన్, ఎంజీఎం సెంటర్‌లలో నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. • ఆధునిక భారత సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ గారే ఆద్యుడు: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి వేడుకలను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నేతృత్వంలో హన్మకొండలోని డీసీసీ కార్యాలయం మరియు ఎంజీఎం సెంటర్ లలో ఈ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డీసీసీ భవన్‌లో ఆయన చిత్రపటానికి, ఎంజీఎం సెంటర్ లోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి...