కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..
పార్టీ బలోపేతం కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారం గీసుగొండ మండలం విశ్వనాథపురం, కొమ్మాల గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు వాంకుడోతు గోప్యానాయక్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.అదేవిధంగా గ్రామంలో వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ నాయకులు బొజ్జు కృష్ణ,బాగాది అభిలాష్ లను పరామర్శించారు.వారి అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిగంగా కొమ్మాల గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరాటి లింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు.అలాగే గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బైరగోని విక్రమ్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్...