ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి - వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్‌తో పాటు రోడ్లు, భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, ట్రైసిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు నగరంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే బ్లాక్ స్పాట్లను...