ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో విస్తృతంగా ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు

గత జూన్ నెలలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో విస్తృతంగా ఆంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడం, డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటి అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా పలువురు పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా అధికారుల పనితీరు, కార్యక్రమాల నిర్వహణలో చూపిన చొరవ, ప్రజలు మరియు విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో చేసిన...