దేవరకొండ డీఎస్పీ, డిండి సీఐ కార్యాలయాల్లో ఎస్పీ వార్షిక తనిఖీలు
కేసుల దర్యాప్తులో నాణ్యత పెంచాలి.. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి – ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా దేవరకొండ డీఎస్పీ కార్యాలయం, డిండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు వివరాలు, పెండింగ్ కేసుల ఫైల్స్, క్రైమ్ రికార్డులు, పరిపాలనా రికార్డులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ...