40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
నేటి రోజులలో అనేకమంది అంటువ్యాధులు ప్రబలి అనారోగ్యమునకు గురి అయ్యి ఆసుపత్రి పాలవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 40 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం సందర్భంగా ఉర్సు ప్రతాప్ నగర్ కరీమాబాద్ వాటర్ ట్యాంక్ ప్రాంతాలలో వరంగల్ మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం హెల్త్ అసిస్టెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆయిల్ బాల్స్ వేస్తున్న పనితీరును కార్పొరేటర్ మరుపల్ల రవి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ తమ ఇంటి పరిసరాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన మురుగునీరు వర్షపు నీరునిల్వ ఉండటం వలన...