మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఎన్. శ్వేత
మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపిఎస్ శుక్రవారం సందర్శించారు. ఈరోజు ఉదయం శిక్షణ కేంద్రాన్ని చేరుకున్న పోలీస్ కమిషనర్ కు శిక్షణా కేంద్రం పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు వివిధ అంశాలపై శిక్షణకై వచ్చే పోలీస్ అధికారులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులను పరిశీలించి.. ఈ కేంద్రం విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఇతర సిబ్బంది పనితీరును సీపీ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ వెంట అదనపు డీసీపీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణ బాబు, ఇన్స్ స్పెక్టర్ రవికుమార్, ఆర్....