సాగర్ నీళ్లు మా హక్కు.. వెంటనే ఎడమ కాల్వకు నీరు విడుదల చేయాలి: జగదీష్ రెడ్డి
నల్గొండ జిల్లా కేంద్రం: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు జరుగుతున్నప్పటికీ తెలంగాణకు చెందిన జిల్లా మంత్రులు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగర్ ఎడమ కాల్వతో పాటు లిఫ్ట్‌లకు కూడా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సాగర్‌లో ప్రస్తుతం 532 అడుగుల నీటి మట్టం ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు...