రూపా రెడ్డి హత్య కేసు ఛేదన.. నల్లగొండ పోలీసులకు కృతజ్ఞతల వెల్లువ

పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం.. దర్యాప్తు బృందానికి అభినందనలు నల్లగొండ: రూపా రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించడంతో నల్లగొండ జిల్లా పోలీసులపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కేసు దర్యాప్తులో పోలీసులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ ప్రతి ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు వారు పేర్కొన్నారు. ఘటన అనంతరం భయాందోళనకు గురైన తమకు పోలీసుల దర్యాప్తు ధైర్యం, భరోసా కల్పించిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో పకడ్బందీ దర్యాప్తు కొనసాగించడంతో కేసు త్వరితగతిన కొలిక్కి వచ్చిందని వారు ప్రశంసించారు....