గంజాయి మత్తులో టీచర్‌పై కత్తులతో దాడి — డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా?

భువనగిరి: కొండమల్లేపల్లిలో 10వ తరగతి విద్యార్థులు గంజాయి మత్తులో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డిపై కత్తులతో దాడి చేసినట్లు వెలువడుతున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బహుజన సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్ అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు, పెన్నులు ఉండాల్సిన వయసులో కత్తులు, మాదకద్రవ్యాలు ఎలా చేరుతున్నాయనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల సరఫరాపై సమర్థవంతమైన నిఘా ఎందుకు లేదని ప్రశ్నించారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం చిన్న వయస్సులోనే విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం కేవలం...