మట్టి, ఇసుక లభ్యత కోసం సులభతర విధానాన్ని రూపొందించాలి
జిల్లాలో విధివిధానాలపై కమిటీ ఏర్పాటు* *హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి* *హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా శాండ్ కమిటీ సమావేశం* ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన మట్టి ఇసుక లభ్యత కొరకు సులభతరమైన విధి విధానాలను రూపొందించాలని *హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి* అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో శాండ్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ వనరులకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... జిల్లాలో...