నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపిఎస్

నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపిఎపి సూచించారు. నేరాల నియంత్రణలో సిసి కెమెరాల ప్రాధాన్యతపై సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్వంలో నగరానికి చెందిన వ్యాపారస్తులకు స్థానిక అంబేద్కర్ భవన్ లో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ప్రధాన రోడ్డు మార్గాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గోని వ్యాపారస్తులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ప్రజల భద్రత కల్పించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అలాగని ఇంతమంది ప్రజలకు వ్యక్తిగత భద్రత కల్పించడం కష్టసాధ్యమని, నేరాల నియంత్రణలో పోలీసులు తమ వంతు కృషి...