భూదాన్ పోచంపల్లి: హెజెలో ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతి గూడెం గ్రామంలో గల హెజెలో ఫార్మా కంపెనీ సి బ్లాక్ లో అర్ధరాత్రి రియాక్టర్ పేలడం వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు దాటికి ఇద్దరు మరణించినట్లు పదిమందికి పైగా గాయపడినట్లు సమాచారం. పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ స్థానికులు,కార్మికులు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గత మూడు నెలల్లో ఇది రెండవ ప్రమాదం. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణలు ఉన్నాయి.నిత్యం ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండటం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ తర్వాత భద్రతను గాలికి వదిలేస్తున్నారు...