స్నేహానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ధర్మారం ఎస్సెస్సీ 93–94 బ్యాచ్ మిత్రులు
93–94 బ్యాచ్ మానవత్వానికి ఆదర్శం స్నేహానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ధర్మారం ఎస్సెస్సీ 93–94 బ్యాచ్ మిత్రులు చిన్ననాటి స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ మిత్రుల్లో ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు ధర్మారం ఎస్సెస్సీ 1993–94 బ్యాచ్ మిత్రులు. తమతో కలిసి చదువుకున్న మిత్రుడు సుగుణాకర్ మృతి చెందడంతో, బ్యాచ్ సభ్యులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.అంతేకాకుండా సుగుణాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్ననాటి నుంచి కొనసాగుతున్న స్నేహాన్ని కేవలం జ్ఞాపకాలకే పరిమితం చేయకుండా.. మిత్రుల...