ప్రభుత్వ పాఠశాలలకు షూస్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ

విద్యార్థులకు అందచేసిన మండల విద్యాశాఖ అధికారులు* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి పర్వతగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకొరకు ఉచితంగా షూస్, స్కూల్ బ్యాగులు, హాస్టల్ విద్యార్థుల కొరకు బెడ్షీట్స్ పంపిణీ చేసినట్లు పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ బిక్షపతి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు మరియు పాఠశాలలకు బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగ్ లు, షూస్ పంపిణీ చేసినట్లు ఇతర ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు ప్రస్తుతానికి షూ లు పంపిణీ చేసినట్లు దశలవారీగా ప్రాథమిక పాఠశాలలకు కూడా అన్ని పంపిణీ చేయడం జరుగునని తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఆయన చేతుల మీదుగా పర్వతగిరి ఉన్నత...