పాత ఇంటి నెంబర్‌తో కొత్త ఇంటి రిజిస్ట్రేషన్! *పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం.. *తప్పుడు ధృవీకరణ పత్రాలపై పోలీసులకు ఫిర్యాదు

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, ఆగస్టు 22 :* పర్వతగిరి మండల కేంద్రం గ్రామపంచాయతీ లో అనుమతి లేకుండా నిర్మించిన కొత్త ఇంటికి పాత ఇంటి నెంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ నాగుల రాజు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగుల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి నాగుల వీరస్వామికి వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాన్ని ముగ్గురు కుమారులు 2020లో తల్లిదండ్రుల సమక్షంలో పంచుకున్నారని తెలిపారు. తనకు కేటాయించిన భాగంలోని పాత ఇంటికి 3-112 నెంబర్ ఉండగా, తాను కుటుంబంతో కలిసి అందులో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. అయితే తన అనుమతి...