“ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్” కార్యక్రమంలో క్రియేటివ్ ఇండస్ట్రీస్‌పై విజయవంతంగా వర్క్‌షాప్

నల్గొండ, ఆగస్టు 22, 2026: “రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్” (RAMP) పథకం కింద “ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్” కార్యక్రమంలో భాగంగా, సినిమాటికా ఎక్స్‌పో మరియు సినికా క్రియేటర్స్ కౌన్సిల్, NI-MSME (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) సహకారంతో క్రియేటివ్ ఇండస్ట్రీస్‌లోని అవకాశాలను ప్రోత్సహించే వర్క్‌షాప్‌ను నల్గొండ IT హబ్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొన్నారు. ఫిల్మ్‌మేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), యానిమేషన్, సినిమా ప్రొడక్షన్, స్టోరీటెల్లింగ్ తదితర సృజనాత్మక రంగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే ఔత్సాహికులకు స్ఫూర్తినివ్వడం, మార్గనిర్దేశం చేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. భారతదేశంలో...