వరంగల్ వెస్ట్‌లో ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ శిక్షణ శిబిరం

హనుమకొండ, ఆగస్టు 22: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ **(ఎస్‌ఐఆర్ ఫేజ్–2)**పై రెండో విడత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీమతి గోదా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, టీపీసీసీ పార్లమెంట్ కోఆర్డినేటర్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈడీ దాడుల్లో 90...