ఎస్సీ సెల్ శ్రేణులు సమరశంఖం పూరించాలి ఆగస్టు 30న రాష్ట్ర ఎస్సీ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటనను విజయవంతం చేయాలి - జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపు

వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ శ్రేణులు సమరశంఖం పూరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆదేశాల మేరకు శనివారం వరంగల్ కాశీబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం చిలువేరు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిధిలోని వివిధ మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, జిల్లా బాధ్యులు హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ...