డిప్యూటీ సీఎం చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్
నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నల్లగొండకు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పలువురు ఫోటో జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్గా సేవలందిస్తున్న ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ తన ఫోటో జర్నలిజం ప్రతిభకు ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇండియా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జాతీయస్థాయి మీడియా ఎడిటర్ల చేతుల...