అబద్ధాలు చెప్పడం,మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట.* *బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి*

జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట , ఆగష్టు 22 :k వర్ధన్నపేట మండల కేంద్రం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలిగిందని,మైక్ లకు పర్మిషన్ లేదని తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నాయకుల పై కేసు పెట్టింది మీ పార్టీ నాయకులు కాదా? పక్కనే భవన నిర్మాణ కార్మికులు , ఆటో యూనియన్ నాయకులు కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది వారిపై లేని కేసులు కేవలం బిఆర్ఎస్ నాయకుల పైన పెట్టడంలో అంతరార్థం ఏంది? అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేవి నీతులు.. చేసేవి చిల్లర రాజకీయాలు.. అని ఎద్దేవా చేశారు. జాతీయ...