హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ కృషి- ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ (UoL) కృషి చేస్తోందని ఆ విద్యా సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి తెలిపారు. ✅ ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్‌లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ✅ ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ అధికారులు కె రామకృష్ణారావు గారు, జయేశ్ రంజన్ గారు పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులతో వారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ✅ ఈ భేటీలో...