రౌడీ షీటర్ల వ్యవహర శైలిపై నిరంతరం నిఘా పెట్టాలి
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల వ్యవహర శైలి పట్ల అధికారులు నిఘా పెట్టాలని వరంగల్ పొలీస్ కమిషనర్ శ్వేత,ఐపిఎస్ అధికారులను అదేశించారు. నెల వారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్వర్యంలో శనివారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపిలు, ఏసిపిలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి వుంటుందని,ప్రతి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని ప్రజలతో సత్ససంబంధాలను కోనసాగించడంతో పాటు, వారి సమస్యలపై తక్షణమే స్పందించడం ద్వారా ప్రజలు పోలీసుల పట్ల స్నేహపూర్వకమైన వాతవరణం నెలకోల్పడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి...