అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు దుప్పట్ల పంపిణీ
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ మాల గుట్ట పరిసర ప్రాంత పేద కుటుంబాలకు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు స్థానికంగా పర్యటించి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను నిశితంగా పరిశీలించారు. సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి...