తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరహత్ అలీ కి మాతృ వియోగం
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ,( I.J.U) రాష్ట్ర అధ్యక్షులు కె. విరహత్ అలీ గారి మాతృమూర్తి బాషారత్ ఉన్నిసా బేగం అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున గజ్వేల్ లోని తమ నివాసంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న యూనియన్ రాష్ట్ర నాయకులు పిన్నా శివ కుమార్,T.U.W.J (I.J.U)వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీరాం రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్,యూనియన్ సీనియర్ నాయకుడు నార్లగిరి యాదగిరి విరహత్ అలీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు బాషారత్ ఉన్నిసా బేగం ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.