నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం-మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని నల్లగొండ క్లబ్‌లో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్ ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ క్లబ్‌లో మంచి వాతావరణం ఉందని, పట్టణ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల...