కల్లెడ చదరంగం పోటీలు–2026 ఘనంగా నిర్వహణ *220 మంది విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం – ₹72,000 నగదు బహుమతులు
*జన చరిత్ర పర్వతగిరి , ఆగష్టు 23: కల్లెడ చెస్ నెట్‌వర్క్ రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (RDF) సంయుక్త ఆధ్వర్యంలో కల్లెడలోని వనిత అచ్యుతపాయి జూనియర్ కళాశాలలో కల్లెడ చదరంగం పోటీలు–2026 ఆదివారం ఆర్ డి ఎఫ్ వ్యవస్థాపకులు కల్లెడ రామ్మోహన్‌రావు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లాలోని 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 220 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పోటీలు ఆరు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగాయి. విద్యార్థులు తమ వ్యూహాత్మక ఆలోచనా శక్తిని, ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీలను ఆసక్తికరంగా కొనసాగించారు. చదరంగం కేవలం వినోదాన్నిచ్చే ఆట మాత్రమే కాకుండా, ఓపిక,...