సింగర్ కరుణాకర్‌కు “జానపద బ్రహ్మ” అవార్డు
వరంగల్: వరంగల్ నగర పరిధిలోని దూపకుంటకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు ఆకులపెల్లి కరుణాకర్కు ప్రతిష్టాత్మకమైన “జానపద బ్రహ్మ” అవార్డు లభించింది. గత 35 సంవత్సరాలుగా జానపద కళారంగంలో కొనసాగుతున్న కరుణాకర్ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. తన కళా ప్రదర్శనల ద్వారా ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ జానపద కళల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ స్థాయి బెస్ట్ సింగర్, బెస్ట్ యువజన అవార్డు, తెలంగాణ బెస్ట్ సింగర్ అవార్డు వంటి పలు పురస్కారాలను అందుకున్నారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, సకల కళా సాంస్కృతిక మండలి సంయుక్త...