భార్యల చేతిలో భర్తల హత్యలు.. ఐదేళ్లలో 785 కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో మహిళల చేతిలో పురుషులు, ముఖ్యంగా భర్తలు హత్యకు గురవుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన అధికారిక నివేదికల్లో “భార్యల చేతిలో హత్యకు గురైన భర్తలు” అనే ప్రత్యేక విభాగాన్ని విడిగా ప్రచురించదు. ఇలాంటి ఘటనలు సాధారణంగా హత్య కేసుల కేటగిరీలోనే నమోదవుతాయి. అయితే NCRB, రాష్ట్రాల క్రైమ్ డేటా ఆధారంగా వచ్చిన పలు నివేదికల ప్రకారం.. 2020 నుంచి 2024 మధ్య ఐదు ప్రధాన రాష్ట్రాల్లో భార్యలు స్వయంగా లేదా ఇతరుల సహాయంతో భర్తల హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలతో మొత్తం 785 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రాల వారీగా గణాంకాలు ఉత్తరప్రదేశ్: 274...