చింతల్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 30 ఏళ్ల యువకుడు మృతి
వరంగల్, ఆగస్టు 24 వరంగల్ శివనగర్–చింతల్ బ్రిడ్జి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల లొల్లటి క్రాంతి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తన తండ్రి చికిత్స నిమిత్తం సంరక్ష ఆసుపత్రికి వెళ్తున్న క్రాంతి, ద్విచక్ర వాహనంపై శివనగర్ నుంచి చింతల్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో క్రాంతికి తీవ్ర గాయాలు కావడంతో పాటు అధిక రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే అతడిని రోహిణి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ క్రాంతి మృతి చెందినట్లు...